ankitam neeke ankitam song mp3 lyrics telugu kalalu

ankitam neeke ankitam song lyrics telugu kalalu 

చిత్రం : స్వప్న సింగర్ : SP BALASUBRAMANIAM (బాల సుబ్రహ్మణ్యం)
పాటని వింటూ హాయిగా పాడుకోండి (ప్లే చేయండి)



అంకితం నీకే అంకితం...
అంకితం...నీకే అంకితం 
నూరేళ్ళ ఈ జీవితం 
అంకితం...నీకే అంకితం 
ఓ ప్రియా... ఆ...ఆ...ఓ ప్రియా... ఓ ప్రియా...
కాళిదాసు కలమందు చిందు అపురూప దివ్య కవిత 
త్యాగరాయ కృతులందు వెలయు గీతార్థసార నవత
నవ వసంత శోభన మయూఖ...
లలిత లలిత రాగ చంద్రలేఖ...
స్వరము స్వరము కలియికలో ఒక రాగం పుడుతుంది 
మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంధీ...
స్వరము స్వరము కలియికలో ఒక రాగం పుడుతుంది 
మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంధీ...
ఆ అనురాగం ఒక ఆలయమైతే... ఏ.. ఏ..
ఆ ఆలయ దేవత నీవైతే... ఏ.. ఏ..
ఆ ఆలయ దేవత నీవైతే...
గానం గాత్రం గీతం భావం... సర్వం అంకితం
అంకితం... నీకే అంకితం 
లోక వినుత జయదేవ శ్లోక శృంగార రాగ ద్వీప 
భారత శాస్త్ర రమణీయ నాద నవ హావ భావ రూప 
స్వర విలాస హాస చతుర నయన...
సుమ వికాస భాస సుందర వదన
నింగి నేల కలయికతో ఒక ప్రళయం పుడుతుంది 
ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రణయం పుడుతుంది...
నింగి నేల కలయికతో ఒక ప్రళయం పుడుతుంది 
ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రణయం పుడుతుంది...
ఆ ప్రణయం ఒక గోపురమైతే... ఏ.. ఏ..
ఆ గోపుర కలశం నీవైతే... ఏ.. ఏ..
ఆ గోపుర కలశం నీవైతే...
పుష్పం.. పత్రం.. దూపం..దీపం.. సర్వం అంకితం
అంకితం...నీకే అంకితం 
నూరేళ్ళ ఈ జీవితం 
అంకితం...నీకే అంకితం 

ఆనందించారు అనుకుంటున్నాను... :)
మరిన్ని అప్డేట్స్ కోసం తెలుగు కళలు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి
Follow Us On Facebook  --> @telugukalalu

మీరు వీటిని ఇష్టపడవచ్చు : 
తలనిండ పూదండ దాల్చిన రాణి సాంగ్ లిరిక్స్
ఇచ్చోటనే పద్యం లిరిక్స్
దేవ దేవం భజే లిరిక్స్ 
DV సుబ్బారావు గారి కాటిసీను
 _/\_Thank You Visit Again_/\_

ankitam neeke ankitam song, ankitam neeke ankitam song, ankitham neeke ankitham naa songs, SP Bala Subramaniam Songs, ankitham neeke ankitham noorella jeevitham,etv sbp song,telugu kalalu, telugukalalu,
తలనిండా 

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు